2 September, 2026 | 8:33 PM

Breaking News

గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •   ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది రేవంత్ రెడ్డి.. ఖబర్దార్   •   ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కరించాలని డిఎంహెచ్వోకు వినతిపత్రం   •  

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి

13-03-2025 | 11:26pm

మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గుడిపల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి పీ.యాదయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. గురువారం పాఠశాలను సందర్శించి రికార్డులు పరిశీలించారు. అనంతరం పాఠశాలలో మౌలిక వసతులను పరిశీలించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంపొందించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందజేయాలన్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాన్ని పెంపొందిం చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యాదేవి ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.