4 May, 2026 | 9:14 AM

డీఎస్సీ భర్తీకి జిల్లా పరిశీలకులు

07-11-2024 01:07 AM

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): డీఎస్సీ 2008 భర్తీ ప్రక్రియ కోసం జిల్లాస్థాయి పరిశీలకులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు పరిశీలన చేసి తరువాత ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. సంగారెడ్డికి విజయలక్ష్మి, నల్లగొండకు రాజీవ్, రంగారెడ్డికు మాడం మెహన్,  హనుమకొండకు ఉషారాణి, ఖమ్మంకు ఎస్ శ్రీనివాసచారీ, నిజామాబాద్‌కు ఎ ఉషారాణి, ఆదిలాబాద్‌కు కే సత్యనారాయణరెడ్డి,  కరీంనగర్‌కు ఎం సోమిరెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు వెంకట నర్సమ్మకు బాధ్యతలు అప్పగించింది.