10 August, 2026 | 1:41 AM

కల్వకుర్తి ఉద్యమ శిఖరం బాలాజీ సింగ్

10-08-2026 12:24 AM
  1. ప్రత్యేక రాష్ట్రం కోసం సింగపూర్ వీడి.. స్వగడ్డ సేవలోకి..
  2. త్యాగాల బాటలో 18 ఏళ్ల మచ్చలేని ప్రస్థానం 
  3. ఆయన త్యాగానికి గుర్తింపు లభించేనా..?

రంగారెడ్డి, ఆగస్టు 9 (విజయక్రాంతి): రాజకీయాల్లో పదవులు సాధించిన వారికంటే ప్రజల గుండెల్లో చోటు   సంపాదించుకున్న వారే అసలైన నాయకులు. అలాంటి అరుదైన ప్రజాధారణ కలిగిన నాయకుడే కల్వకు ర్తి ఉద్యమ నేత బాలాజీ సింగ్. సుదూర తీ రాల్లో, సింగపూర్లో ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నప్పటికీ... పుట్టిన గడ్డపై ఉన్న మ మకారం, నియోజకవర్గ ప్రజల ఆవేదన ఆ యనను స్థిరంగా ఉండనివ్వలేదు. విదేశీ వె లుగులను వదులుకుని కల్వకుర్తి మట్టి సేవ లో తరించడానికి తిరిగి వచ్చిన ఆయన, గత 18 ఏళ్లుగా అవినీతి మచ్చ లేని స్వచ్ఛమైన ప్రజాజీవితాన్ని కొనసాగిస్తున్నారు.

ఉద్యమంలో క్రియాశీలకం... ప్రాణాలను సైతం పణంగా పెట్టి!

తెలంగాణ మలిదశ ఉద్యమంలో కెసిఆర్ పిలుపు మేరకు కల్వకుర్తి నియోజకవర్గాన్ని ముందంజలో నిలిపిన ఘనత బాలాజీ సింగ్దే. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో  సబ్బండ వర్ణాలను ఏకం చేసి జేఏసీ (జేఏసీ ) లను ఏర్పాటు లో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు అనడంలో అతిశయోక్తి లేదు.పల్లె పల్లెనా ఉద్యమ జెండాలు ఎగరేసి కళాకారులతో పల్లె పల్లెనా ధూంధాం కార్యక్రమాలతో స్వరాష్ట్ర కాంక్షను రగిలించారు. అయినా నాటి నేతలు ఆయన త్యాగాలను గుర్తించలేదు. 

పోరుబాటనే ఆయన పంథం..

కల్వకుర్తి నియోజకవర్గంలో విద్యుత్ బాధితుల కోసం 72 గంటల దీక్ష చేసి అప్పటి ప్రభుత్వంలోనే కదిలిక తెచ్చారు. ఆయన పోరాటం లో గొప్ప మలుపు గా చెప్పుకోవచ్చు.అస్తవ్యస్త విద్యుత్ సరఫరా వల్ల ప్రాణాలు కోల్పోయిన పేద రైతు కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని కోరుతూ ఆయన చేపట్టిన 72 గంటల ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచింది.

రెవెన్యూ డివిజన్ సాధన..

 కల్వకుర్తి ప్రజల దశాబ్దాల కల అయిన ’రెవెన్యూ డివిజన్’ సాధన కోసం పాలక, ప్రతి పక్ష నేతలతో కలసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, విజయం సాధించారు. కల్వకుర్తి మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి ఏకంగా రూ. 15 కోట్ల నిధులను సాధించి కల్వకుర్తి రూపురేఖలు మార్చడంలో కీలక పాత్ర పోషించారు.కాంగ్రెస్ విజయం లో క్రియాశీలక పాత్ర పోషించారు. తన సొంత ఆస్తిని విక్రయించి కొంత ఆర్థిక మూలాలను సమకూర్చి కల్వకుర్తి నిరంతర అభివృద్ధి ధ్యేయంగా ముందడుగు వేశారు.

ప్రాంత బిడ్డ రేవంత్ రెడ్డికి అండగా నిలిచేందుకు ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాగర్ కర్నూల్ జిల్లాలోని 7 మంది జడ్పీటీసీలు, 4 గురు ఎంపీపీలు, దాదాపు 60 మంది ముఖ్య నాయకులను కాంగ్రెస్లోకి తీసుకెళ్లి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు.10 మండలాల్లో కాంగ్రెస్ గెలుపు కోసం రాత్రింబవళ్ళు శ్రమించారు. చివరకు పార్టీ గెలుపు కోసం, ఎన్నికల ఖర్చుల కోసం తన సొంత 5 ఎకరాల ఫామ్హౌస్ను సైతం ను విక్రయించి పార్టీ గెలుపు లో ముఖ్య భూమికపోషించారు.

త్యాగాలకు గుర్తింపు దక్కేనా..?

టిఆర్‌ఎస్ నుంచి నేటి కాంగ్రెస్ వరకు... నాయకులు బాలాజీ సింగ్ కష్టాన్ని, ప్రజాదరణను, రాజకీయ వ్యూహాలను తమ గెలుపు కోసం వాడుకున్నారే తప్ప ఆయన త్యాగానికి తగిన నాయకత్వ గుర్తింపు ఇవ్వలేదనే ఆవేదన కల్వకుర్తి ప్రజల్లో వ్యక్తమవుతోంది. సొంత ఆస్తులను, ప్రాణాలను పణంగా పెట్టిన ఉద్యమకారుడికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే, ఇక నిజాయితీగల ప్రజాసేవకు విలువెక్కడ అనే ప్రశ్నలు నియోజకవర్గంలో తలెత్తుతున్నాయి.

ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న నేటి కాంగ్రెస్ హయాంలోనైనా ఈ ఉద్యమ వీరుడికి  ఆయన  చేసిన త్యాగాలకు, కల్వకుర్తి ఆత్మగౌరవానికి తగిన గౌరవం దక్కాలని నియోజకవర్గ ప్రజలు ముక్తకంఠంతో నినాదిస్తున్నారు. చూడాలి మరి సీఎం రేవంత్ రెడ్డి కల్వకుర్తి ఉద్యమ బిడ్డ బాలాజీ సింగ్ కు సముచిత స్థానం కల్పిస్తారా?.. లేదన్నది వేచి చూడక తప్పదు మరి.