10 August, 2026 | 3:21 AM

రైతుల సాగునీటి కష్టాలకు బీఆర్‌ఎస్ పాపమే కారణం

10-08-2026 02:12 AM
  1. 10 సంవత్సరాలు ఏం చేశారో రైతులకు చెప్పాలి
  2. గ్రావిటీ కెనాల్ నిర్మాణంలో విఫలమైన గత ప్రభుత్వం
  3. తప్పులు చేసిన వారే  రైతులను రెచ్చ గొడుతున్నారు
  4. ఎమ్మెల్యే ప్రత్యేక కృషితో నేటి నుండి కాలువలకు నీటి విడుదల 
  5. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు

గణపురం, ఆగస్టు 9 (విజయ క్రాంతి) : రైతుల సాగునీటి కష్టాలకు బిఆర్‌ఎస్ పాపమే కారణమని గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలే నేడు రామప్ప నుండి వచ్చే గ్రావిటీ కెనాల్ కు మరణ శాసనం అయిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గోదావరి జలాలు రామప్ప చెరువులో  28 ఫీట్లకు చేరిన తర్వాతనే తూము ద్వారా గ్రావిటీ కెనాల్ నుండి వంగపల్లి వాణి చెరువు నిండిన తర్వాత గణపసముద్రంలోకి వచ్చే విధంగా నిర్ణయం తీసుకున్న గత ప్రభుత్వ నాయకులే నేడు నిరంతరం ప్రజల కొరకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ పై విమర్శలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించడమేనని విమర్శించారు.

ఒకసారి చెరువు నిండితే మూడు పంటలు పండే గణప సముద్రం ఆరు మండలాలకు త్రాగునీరు అందించే మిషన్ భగీరథ పుణ్యమా అని ఆయకట్టు రైతులకు నీరు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటెక్ వెల్ నిర్మాణం దశలో ఆయకట్టు రైతులకు 25 ఫీట్ల రిజర్వాయర్ నీళ్లు ఉంచి గ్రావిటీ కాలువ ద్వారా వచ్చే మిగతా నీటిని ఆరు మండలాల తాగు నీటి అవసరాలకు వినియోగిస్తామని గణపురం ఆయకట్టు రైతులను నమ్మించి మోసం చేశారని,గ్రావిటీ కెనాల్ కు రామప్ప చెరువు 24 ఫీట్ల నీరు ఉన్నప్పటినుండి వచ్చే విధంగా ఎలాంటి నిర్ణయాలు చేయలేదని అలాంటివారు ఈరోజు రైతులను రెచ్చగొట్టడం వారి అవివేకానికి నిదర్శనం అన్నారు.

అయినప్పటికీ ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ ప్రత్యేక చొరవతో రెండు జిల్లాల కలెక్టర్లను సమన్వయం చేస్తూ రామప్ప చెరువు నుండి గ్రావిటీ కెనాల్ ద్వారా నీరు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని,అదే క్రమంలో వ్యవసాయ పనులు సాగేందుకు కాలువల ద్వారా సోమవారం నీటి విడుదల చేస్తున్నట్లు రైతులందరూ గమనించాలని కోరారు.భవిష్యత్తులో ఇలాంటి వర్షాభావ పరిస్థితులు సంభవించినా ఆయకట్టు రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఎమ్మెల్యే జిఎస్‌ఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు.

ఈ సమావేశంలో సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కటుకూరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ దూడపాక శంకర్, నాయకులు తాళ్లపల్లి భాస్కర్ రావు,చోటేమియా,ముత్యాల రాజయ్య,చింతిరెడ్డి సమ్మిరెడ్డి, దుగ్యాల నారాయణరావు,గుర్రం తిరుపతి గౌడ్,వంగ రవి,ఆవుల రవి,లక్ష్మారెడ్డి,గంధం మల్లేష్, బూర రాజగోపాల్,నారగాని మోహన్,తొట్ల కుమార్,వడ్ల యాదగిరి,పశ్చిమట్ల స్వామి, సైదులు,బోడిగే శివ, మచ్చిక రక్షిత్,శివరాత్రి సారయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.