యువతకు జిల్లాస్థాయి క్రీడా పోటీలు
- సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్
- ఈ నెల 17లోగా పేర్లు నమోదు
నిజామాబాద్, ఏప్రిల్ 10(విజయక్రాం తి): నిజామాబాద్ జిల్లాస్థాయి క్రీడాకా రుల ను ప్రోత్సహించే ఉద్దేశంతో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ‘నిజామాబాద్ ప్రీమియర్ లీగ్’ జిల్లాస్థాయి క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు.ఈ క్రీడా పోటీల ద్వారా ము ఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, మాదక ద్రవ్యాల నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజల్లో, యువతలో విస్తృత అవగాహన కల్పించడ మే ప్రధాన లక్ష్యం.
ఈ మెగా టోర్నమెంట్ నిర్వహణ కోసం సాయి చైతన్య, ఐపీఎస్ చైర్మన్‌గా, బస్వ రెడ్డి కన్వీనర్‌గా, కవిత రెడ్డి జనరల్ సెక్రటరీగా ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కమిటీ లో జాయింట్ సెక్రటరీలుగా కే. శ్రీనివాస్ రెడ్డి (స్పోర్ట్స్), డాక్టర్ కే. శిరీష్ కుమార్ (సైబర్ సెక్యూరిటీ), రజినీకాంత్ (ఫిజికల్ సెక్యూరిటీ), ట్రెజరర్‌గా కే. సంతోష్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రీడా సంబరాల్లో భాగంగా మొత్తం ఐదు రకాల పోటీల ను నిర్వహిస్తున్నారు.
వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ పోటీలు నిజామాబాద్‌లోని డీఎస్‌ఏ మైదానంలో జరగనున్నాయి. వాలీబాల్ ఇన్‌చార్జిగా మల్లేష్ గౌడ్ (94407116 35), బాస్కెట్ బాల్ ఇన్‌చార్జిగా బి. నరేష్ (9440404424), కబడ్డీ ఇన్‌చార్జిగా ప్రశాంత్ (9866770889) వ్యవహరిస్తున్నారు. ఈ మూడు విభాగాల్లో విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారు. యోగా పోటీలు సుభాష్ నగర్‌లోని కాకతీయ ఒలంపియాడ్ స్కూల్‌లో నిర్వహిస్తా రు. సంగీత (98484 20803), గంగాధర్ (8074982200) వీటిని పర్యవేక్షిస్తారు.
క్రికెట్ పోటీలు కంటేశ్వర్‌లోని మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో 12 ఓవర్ల ఫార్మాట్‌లో హార్డ్ టెన్నిస్ బాల్‌తో నిర్వహిస్తారు. క్రికెట్ ఎంట్రీ ఫీజు రూ. 5,000 కాగా, కేవలం మొదట నమోదు చేసుకున్న 32 టీమ్‌లకు మాత్రమే అవకాశం ఉంటుంది.ఈ పోటీల్లో పాల్గొనదలచిన వారు ఈ నెల17-న సాయం త్రం 5 గంటల లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. పోటీలకు సంబంధించిన డ్రా ఈ నెల 18-న మధ్యాహ్నం 2గంటలకు తీయనున్నారు.
ఈ టోర్నీ కేవలం జిల్లా నివాసుల కు మాత్రమే అవకాశం ఉండటంతో, క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ వెంట తీసుకురావాలి.కాగా యోగా పోటీదారులు వయస్సు ధృవీకరణ కోసం స్కూల్ బోనఫైడ్ లేదా ఎస్‌ఎస్‌సీ మెమో సమర్పించాల్సి ఉంటుంది. క్రికెట్ క్రీడాకారులు సొంతంగా తెలుపు ప్యాంట్, తెలుపు బూట్లు తెచ్చుకోవాలి, నిర్వాహకులు కేవలం టీ-షర్టులు మాత్రమే అందిస్తారు. క్రీడాకారులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు.
దీని బాధ్యతలను స్వామి కుమార్, వినోద్ పర్యవేక్షిస్తారు. టెక్నికల్ ఇన్‌చార్జిలుగా వెం కట్, సురేష్, గంగాదాస్ వ్యవహరిస్తారు. టోర్నమెంట్ సమన్వయకర్తలుగా జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ బి. పవన్ కుమార్ (97011 77144), కబడ్డీ కోచ్ ప్రశాంత్ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలోని క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.




