27 June, 2026 | 7:06 PM

Breaking News

జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •  

జిల్లా స్థాయి క్రీడా పోటీలు షురూ..

09-02-2026 12:00 AM

నిర్మల్, ఫిబ్రవరి ౮ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2025--26లో భాగంగా నిర్మల్ జిల్లా స్థాయి క్రీడల ఎంపికలు వాసవి వరల్ స్కూల్ సమీపంలోని క్రీడా మైదానంలో ఆదివారం నిర్వహించారు. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి దాదాపు 800 మంది క్రీడాకారులు, సుమారు 100 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా సం ఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఖోఖో, సాఫ్ట్బాల్, బేస్బాల్, క్యారమ్, టేబుల్ టెన్నిస్, హ్యాండ్బాల్, కరాటే, కిక్బాక్సింగ్, జూడో విభాగాల్లో ఎంపికలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుబీర్ మండల విద్యాశాఖ అధికారి విజయ్కుమార్, పీఈటీ సంఘాల బాధ్యులు, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.