09-02-2026 12:00:00 AM
నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్, ఫిబ్రవరి 8 (విజయ క్రాంతి): రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని రుణ గ్రహీతలు కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అశోక్ గౌడ్ లు మార్చి 2 తేదీ నుండి ఆరు వాయిదాలలో చెల్లించాలని, మొదటి వాయిదా చెల్లించని యెడల ఒక సంవత్సరం జైలుశిక్ష అనుభవించాలని నిజామాబాద్ మొదటి అదనపు జ్యూడిషియల్ ప్రథమశ్రేణి మేజిస్ట్రేట్ (జూనియర్ సివిల్ జడ్జి )ఖుష్భూ ఉపాధ్యాయ తీర్పు చెప్పారు.
వివరాలు నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట నివాసుడైన ఎండల సురేందర్ తనకు పరిచయస్తులైన ఆర్యనగర్ కు చెందిన కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కి 50 లక్షల అప్పును ఇచ్చాడు. తిరిగి రుణం చెల్లించడానికి వీలుగా కేతిరెడ్డి రెండు కార్పొరేషన్ బ్యాంక్ చెక్ లు 25 లక్షల చొప్పున వ్రాసి ఇచ్చాడు.చెక్ లు తీసుకున్న సురేందర్ తన స్టేట్ బ్యాంక్ ఖాతాలో జమ చేశారు, కాని కేతిరెడ్డి బ్యాంక్ ఖాతాలో తగిన నగదు నిలువలు లేనందున చెక్స్ బౌన్స్ అయ్యాయి. న్యాయవాది ద్వారా లీగల్ నోటిస్ పంపించి, కోర్టులో కేసు వేశాడు.
న్యాయ విచారణలో భాగంగా విచారించి ఇద్దరి బ్యాంక్ చెక్ లు, కేతిరెడ్డి బ్యాంక్ ఖాతాకు సంబందించి బ్యాంక్ జారీ చేసిన ’బ్యాంక్ ఖాతాలో తగిన నగదు నిలువలు లేవంటు ’ సర్టిఫికెట్, ఇతర ఆధారాలు పరిశీలించి కేతిరెడ్డి 50 లక్షలు 8 లక్షల 33 వేల చొప్పున ఆరు నెలల వాయిదాలలో చెల్లించాలని తీర్పు చెప్పారు. మొదటి వాయిదా మార్చి 2 వ తేదీన చెలియించాలని, చెల్లించని యెడల ఒక సంవత్సరం జైలు శిక్ష కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనుభవించాలని జడ్జి ఖుష్భూ ఉపాధ్యాయ తీర్పు లో పేర్కొన్నారు.
అశోక్ గౌడ్ కు పై తీరుగానే తీర్పు...
ఎండల సురేందర్ దగ్గర తీసుకున్న అప్పు 20లక్షలు ఆరు వాయిదాలలో 3 లక్షల 33 వేల చొప్పున చెల్లించాలని, మొదటి వాయిదా మార్చి 2 చెల్లించాలని, చెల్లించకుంటే అశోక్ గౌడ్ ఒక సంవత్సరం జైలుశిక్ష అనుభవించాలని జడ్జి ఖుష్భూ ఉపాధ్యాయ మరొక చెక్ బౌన్స్ కేసులో తీర్పు చెప్పారు.