24 August, 2026 | 3:17 AM

ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

24-08-2026 02:46 AM

నస్పూర్, ఆగష్టు 23 : నస్పూర్ మండ లం శ్రీరాంపూర్ కాలనీ వాటర్ ట్యాంక్ ఏరియాలోని పోచమ్మ దేవాలయంలో ఆదివా రం పోచమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ గౌరవ అధ్యక్షుడు, కార్పొరేటర్ బండారి సుధాకర్, ఆలయ కమిటి ఆ ధ్యక్షుడు అర్కాల శ్రీనివాస్ ఆద్వర్యంలో ముందుగా గణపతి హోమం, ఆమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపన వేడుకలు నిర్వహించారు.

అనంతరం వేద పండితులు బు డి అరుణ్ శర్మ, బుడి అణుదీప్ శర్మ, సుబ్బ అభేషేక్ శర్మ, వేదాంతు సచిన్ శర్మ, గణేష్ శర్మలు ఆలయంలో పోచమ్మ తల్లి విగ్రహానికి శాస్త్రోక్తంగా పూజలు చేసి కార్పొరేటర్ బండారి సుధాకర్, మాజీ మున్సిపల్ చైర్మెన్ ఇసంపెల్లి ప్రభాకర్ లచే పోచమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. అనంతరం మం చిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ డీసీసీ ఆధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ సర్పంచ్ జక్కుల రాజేశం,

బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు, కేతిరెడ్డి సురేందర్రెడ్డిలు మహోత్సవాల్లో పా ల్గోని పూజలు చేశారు. ఆలయంలో మహిళలచే సామూహిక కుంకుమార్చనలు, గర్తవా సం, బీజ న్యాసం, మండపార్చణ, మూల మంత్రం కన్యా లగ్నమున పోచమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్టాపన పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆద్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.