calender_icon.png 11 November, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం..

11-11-2025 07:32:16 PM

కరీంనగర్ (విజయక్రాంతి): నగరంలోని డీసీసీ కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం మంగళవారం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. బూతు స్థాయిలో మహిళా కాంగ్రెస్ బలోపేతం, పార్టీ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడం తదితర అంశాలపై మహిళా నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా కర్ర సత్య ప్రసన్న రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బూతు స్థాయిలో మహిళా కమిటీల నియామకం పూర్తి చేయాలని, ఎన్నికలకు సంసిద్ధం కావాలని కార్యవర్గ సభ్యులకు సూచించారు.

ఎన్నికల బరిలో నిలిచే మహిళా నేతల గెలుపు కోసం ఆయా ప్రాంతాలకు చెందిన మహిళ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు కృషి చేయాలని  కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, ప్రధాన కార్యదర్శి వంగల జ్యోతి రెడ్డి, కార్యదర్శి వంగల కల్యాణి రెడ్డి, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్నం రజిత రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు, అసెంబ్లీ ఇన్చార్జులు, పద్మ, హసీనా, హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పుష్పలత, మండల కాంగ్రెస్ అధ్యక్షులు దేవేంద్ర, రాధ, జిల్లా ఉపాధ్యక్షులు మల్లిక, స్వప్నశ్రీ, ప్రధాన కార్యదర్శులు స్వరూప, సుజాత, కార్యదర్శులు శిల్ప, సునీత, తదితరులు పాల్గొన్నారు.