11-11-2025 07:30:10 PM
మంథనిలో అధికారులకు ఫిర్యాదులో నాయిని సంతోష్..
మంథని (విజయక్రాంతి): మంథని శ్రీపాద కాలనీ అదనంగా భూమి కబ్జా చేసిన ఎండీ మజీద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మంథని బోయినపేటకు చెందిన నాయిని సంతోష్ మంగళారం అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మంథని మున్సిపాలిటీ పరిధిలోని శ్రీపాద కాలనీ ఒకటో వార్డులో ఎండీ మజీద్ అక్రమంగా భూమి కబ్జా చేసి నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఇందిరమ్మ ఇంటి పట్టాకు 121 గజాలు మాత్రమే అధికారులు ఇచ్చారని, కానీ మజీద్ 363 గజాలు కబ్జా చేసి కాంపౌండ్ గోడ కట్టడం జరిగిందని మంథని ఆర్డీఓ సురేష్ కు మున్సిపల్ కమిషనర్ మనోహర్ కు మంథని తాసిల్దార్ కుమారస్వామితో పాటు ఇతర అధికారులకు ఫిర్యాదులో సంతోష్ పేర్కొన్నారు. మజీద్ కబ్జా చేసిన విలువైన భూమిని అధికారులు స్వాధీనం చేసుకోని మజీద్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సంతోష్ అధికారులను కోరారు.