6 August, 2026 | 1:11 AM

జిల్లా అధికారి, ఎమ్మెల్యే భేటీ

06-08-2026 12:18 AM

అలంపూర్, ఆగస్టు 5 (విజయక్రాంతి): జోగులాంబ గద్వాల జిల్లా చేనేత వస్త్ర పరిశ్రమల శాఖ సహాయ సంచాలకురాలు  వి.ఇందిర అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి చేనేత రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. అయితే ఈ భేటీపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చ నెలకొంది.

జిల్లా స్థాయి అధికారిణి అయినప్పటికీ, జిల్లా కేంద్రం లేదా సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో కాకుండా, తెలంగాణ దాటి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు పట్టణంలోని ఎమ్మెల్యేను కలవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధిని కలిసేందుకు జిల్లా అధికారులకు సొంత జిల్లాలోనే అవకాశం లేకపోయిందా? అనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి.