6 August, 2026 | 1:59 AM

సైబర్ మోసాలపై పోలీసుల హెచ్చరిక

06-08-2026 01:03 AM

‘సురక్ష కా తిరంగా’ నెలరోజుల కార్యక్రమం ప్రారంభం

శేరిలింగంపల్లి, ఆగస్టు 5 (విజయక్రాంతి): సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు బుధవారం ‘సురక్ష కా తిరంగా - సైబర్ స్వతంత్ర తెలంగాణ వైపు’ నెలరోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాచిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్లో జరిగిన ఈ కార్యక్రమంలో 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కమిషనర్ డా. ఎం. రమేష్ ఐపీఎస్ మాట్లాడుతూ సైబరాబాద్లో 60 శాతం సైబర్ నేరాలు పెట్టుబడి, ట్రేడింగ్ మోసాలేనని చెప్పారు.

ఆన్లైన్లో అసాధ్యమైన లాభాలు చూపించే స్కీమ్లను నమ్మకండి. మోసం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయండని హెచ్చరించారు.ప్రధాన అతిథి నటి అంజలి క్లిక్ చేయడానికి ముందు ఆలోచించండని సూచించారు. సైబర్ క్రైమ్స్ డీసీపీ పుష్ప మోసగాళ్లు భయం, అజ్ఞానం, దురాశ, తొందర, నమ్మకం ద్వారా మోసం చేస్తున్నారని వివరించారు.విద్యార్థులు సైబర్ అంబాసిడర్లుగా మారి అవగాహన వ్యాప్తి చేయాలని కోరారు.ఈ నెలంతా కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నట్లు తెలిపారు.