సైబర్ నేరలపై విస్తృత అవగాహన
భైంసా, ఆగస్టు 5 (విజయక్రాంతి): తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు ప్రజల్లో సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలను చైతన్యం చేస్తున్నామని జిల్లా ఎస్ పీ జానక షర్మిల తెలిపారు. బుధవారం భైంసా పట్టణంలో బుధవారం నిర్వహిస్తున్న ‘సైబర్ జాగృతి దివస్‘ కార్యక్రమంలో భాగంగా, ఈరోజు భైంసా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. జి.జానకి షర్మిల, ‘సైబర్ జాగృతి దివస్‘ పోస్టర్లను విడుదల చేసి మాట్లాడారు.
ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీలు, బ్యాంకు వివరాలు, పాస్వర్డ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని, తెలియని లింకులు, అనుమానాస్పద యాప్లు, నకిలీ వ్బుసైట్లను ఓపెన్ చేయవద్దని ప్రజలకు సూచించారు.
అలాగే పోలీసు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగాల కోసం సిద్ధం కావాలని, సమయాన్ని వృథా చేయకుండా వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. చెడు అలవాట్లు, ఆన్లైన్ బెట్టింగ్లు, జూదం వంటి వాటికి దూరంగా ఉండి జీవితాన్ని ఉన్నత లక్ష్యాల వైపు మలుచుకోవాలని సూచించారు. సైబర్ నేరానికి ఒకరైతే 19 30 నెంబర్ కు కాల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, ఐపీఎస్, ఇన్స్పెక్టర్లు రవీందర్ నాయక్, దీపక్,సాయి కుమార్, ఎస్‌ఐ లు,పోలీసు సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






