calender_icon.png 20 January, 2026 | 5:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తపస్ నూతన రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా వాసులకు చోటు

20-01-2026 03:27:30 PM

నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం TPUS నూతన కార్యవర్గాన్ని ఇటీవల ప్రకటించింది. నూతనంగా ఎన్నుకోబడిన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర బాధ్యుల నియామకంలో భాగంగా నిర్మల్ జిల్లాకు  చెందిన ఇద్దరికీ రాష్ట్ర కార్యవర్గంలో సముచిత స్థానం కల్పించారు జిల్లాకు చెందిన జిలకరి  రాజేశ్వర్( MPPS చుచుంద్), తిరునగరి నవీన్ కుమార్(ZPSS మన్మథ్) రాష్ట్ర సేవా ,ప్రశిక్షణ కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేశారు. జిల్లా వాసులు ఇద్దరికీ రాష్ట్ర కార్యవర్గంలో చోటు లభించడం విశేషం.. జాతీయ వాదం, వృత్తి ధర్మం అనే లక్ష్యాలతో సంఘ అభివృద్ధికి కృషి చేయడానికి ఈ అవకాశం తోడ్పడుతుందని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు.