15 March, 2026 | 8:42 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

గ్రామాన్ని హరితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

20-01-2026 03:32 PM

నర్సరీ పనులను ప్రారంభించిన సర్పంచ్ దాసరి ఎల్లమ్మ శ్రీను

తుంగతుర్తి,(విజయక్రాంతి): గ్రామాన్ని పచ్చని హరితం గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తామని సర్పంచి దాసరి ఎల్లమ్మ శ్రీను అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని తూర్పు గూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో పాటు, నర్సరీ పనులను సర్పంచ్ దాసరి ఎల్లమ్మ శ్రీను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...గ్రామీణ ఉపాధి అవకాశాలు పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు  చెప్పారు.ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో అర్హులైన వారికి పని కల్పించడంతో పాటు గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతామని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో అవసరమైన మొక్కలను స్థానికంగానే పెంచే ఉద్దేశంతో నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల హరితాభివృద్ధికి బలమైన పునాది పడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్,గ్రామ ఉపసర్పంచ్  కన్నెబోయిన కళ్యాణ్,వార్డు సభ్యులు మధు, క్రాంతి కుమార్,ఫీల్డ్ అసిస్టెంట్ పద్మ గ్రామస్తులు  సంకినేని రమేష్, గుండ్ల వెంకన్న, రామ్ లాల్ ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.