20-01-2026 03:18:31 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): వాగేశ్వరి మహిళా డిగ్రీ, పిజి కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం(ఎన్ ఎస్ ఎస్) రామడుగు మండలం లోని వెదిర గ్రామంలో ఏడు రోజుల శీతకాల శిబిరాన్ని గ్రామ సర్పంచ్ శనిగరపు అంజన్ కుమార్, ఉప సర్పంచ్ దుగ్యాల రాజిరెడ్డితో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్బంగా సర్పంచ్ అంజన్ కుమార్ మాట్లాడుతూ మా వెదిర గ్రామ పంచాయతీని వాగిశ్వరి కళాశాల విద్యార్థులు ఎన్నుకున్నoదుకు సంతోషంగా ఉందన్నారు.విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవా రంగాల్లో రాణించడం అభినందనీయమని, ఏడు రోజుల శిబిరానికి అన్ని విధాలుగా వాలంటీర్లకు సహకరిస్తామని, వారి ద్వార గ్రామంలో గ్రామస్తులకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తదుపరి ఉపసర్పంచ్ దుగ్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం వాలంటీర్లు రావడం సంతోషంగా ఉందన్నారు.
విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా దేశ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వెదిర ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ కె.రాజమౌళి, ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ కె.సరళదేవి , అంగన్వాడీ టీచర్ వంచ భాగ్యరాణి,శ్వేత,సునీత, గౌతమి, వాగేశ్వరి మహిళా డిగ్రీ & పిజి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సిహెచ్.రమణ చార, ఎన్ ఎస్ ఎస్ కో-ఆర్డినేటర్ ఎన్.స్వప్న, సీనియర్ అధ్యాపకురాలు ఎ.అంజలి, ఎస్. సంగీత,పెద్దపల్లి సాయి కుమార్ మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.