నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలి
నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి నేరస్థులకు శిక్ష పడే విధంగా అధికారులందరూ కృషి చేయాలని ఎస్పీ రోహిత్ రాజు అధికారంలో ఆదేశించారు. బుధ వారం జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ కేసులో ’క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు.కేసుల విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
పోలీస్ అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు. పెట్రోలింగ్, బ్లూ కోలట్స్ వాహనాలతో అధికారులు,సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్ధాలు,మట్కా,జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎరైవ్ ఎలైవ్ -2026 రెండో విడతలో భాగంగా ప్రజలకు రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్,కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,ఇల్లందు డిఎస్పీ వెంకన్న బాబు,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి పాల్గొన్నారు.




