పాయం, పొంగులేటిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
- కాంగ్రెస్ మండల నాయకులు
గుండాల, (విజయక్రాంతి): మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వాంకుడోత్ బీకోజీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్ లు మాట్లాడుతూ...పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఒక అమాయక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడం సబబు కాదని, నిజంగా వారు ఎలాంటి తప్పూ చేయకపోతే ఇప్పటివరకు ప్రజల ముందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అసలు తప్పు చేసారా లేదా అని చట్టం తన పని తాను చేస్తుంది కానీ మండల బీఆర్ఎస్ నాయకుల తీరు ఎలా ఉంది అంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే మేమే అని మీరెందుకు ఉలికి పడుతున్నారు, మీ నాయకుడ్ని మీరు సమర్దించుకోవడంలో తప్పు లేదు కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులను మరీ ముఖ్యంగా మా నాయకుడు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
10 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనీసం మండల కేంద్రంలో ఒక సర్పంచ్ అభ్యర్థిని నిలపెట్టుకోలేక పోయారని అక్కడే అర్ధం అయితుందని, మీ పార్టీ చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చేసిన మంచి ఏంటోనని విమర్శించారు. పాయంని విమర్శించే ప్రతీ ఒక్కరికి కూడా గతంలో పాయం పెట్టిన రాజకీయ బిక్షనేనని, వారు చేసే ప్రతీ ఒక్క విమర్శ కూడా ఆకాశాన్ని చూసి వారిపై వారే ఉమ్మి వేసుకోవడమేనని దుయ్యబట్టారు. పాయం ఏ అభివృద్ధి చేయలేదని విమర్శించే వారు ఈ మూడు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
1. చీమలగూడెం PR రోడ్డు నుండి ఇప్పలచెలక గ్రామము వరకు ఒక కోటి రూపాయలతో BT రోడ్డు
2. కొడవటంచ PR రోడ్డు నుండి నడిమిగూడెం వరకు ఒక కోటి 50 లక్షల రూపాయలు BT రోడ్డు నిర్మాణం
3. కొడవటంచ నుండి నాగారం వరకు రెండు కోట్ల రూపాయల వ్యయంతో BT రోడ్డు నిర్మాణం
4. మండలంలో సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో చెక్ డ్యాంలు
5. మండల కేంద్రంలో పీహెచ్సీలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు
6. మండల వ్యాప్తంగా పార్టీలకు, కులాలకు అతీతంగా 500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
గురుంచి వారు వివరించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ,శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లపై భవిష్యత్ లో మరొక్కసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మేము తెలియజేసిన అభివృద్ధి పనులపై కావాలంటే ప్రజల మధ్య బహిరంగ చర్చకు మేము సిద్ధమని సవాలు విసిరారు.






