కేశ్వాపురంలో కోరమాండల్ ఆధ్వర్యంలో వరి క్షేత్ర సందర్శన
07-08-2026 09:15 AM
కూసుమంచి, ఆగస్టు 7 విజయక్రాంతి: కూసుమంచి మండలంలోని కేశ్వాపురం గ్రామంలో కోరమాండల్ కంపెనీ ఆధ్వర్యంలో వరి క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. వరి పంటలో కలుపు మందు నివారణ పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి అశోక్ మాట్లాడుతూ ఈ సీజనల్ లో వరి సాగు చేస్తున్న రైతులు కలుపు మందు కోసం డెసిమేట్ ను వాడాలని సూచించారు. ఈ మందు కేవలం 140 గ్రాముల మందు ఎకరానికి సరిపోతుందన్నారు. వరి నాటిన వారం రోజులలో ఫెర్టిలేజర్ లేదా ఇసుకతో కలిపి చల్లుకోవాలని సూచించారు. దీని వలన కలుపు నివారణతో మంచి దిగుబడి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ జోనల్ మేనేజర్ హుస్సేన్ పాషా, టెర్రిటరీ మేనేజర్ రవీందర్,సందీప్ తదితరులు






