సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యల పరిష్కారానికై కృషి చేయాలి
లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
లక్ష్మీదేవిపల్లి, జూలై 10, (విజయక్రాంతి): వివిధ సంస్థలపై పోలీస్ స్టేషన్కు వచ్చే బాధ్యతల సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు ,సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. స్టేషన్ పరిధిలోని క్రైమ్ ప్రాపర్టీని పరిశీలించి వాటి భద్రత,నిర్వాహన పై అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ, చుంచుపల్లి సీఐ ఆర్. వెంకటేశ్వర్లు, ఎస్త్స్రలు అఖిల, రాజమౌళి సిబ్బంది పాల్గొన్నారు.






