జిల్లావ్యాప్తంగా పుస్తక ప్రదర్శన
16-05-2026 01:32 AM
మహబూబాబాద్, మే 15 (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కా ర్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో శుక్రవారం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా లైబ్రరీ డే నిర్వ హించారు. ఈ సందర్భంగా వివిధ గ్రంథాలయాలు, పాఠశాలలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు.
కేసముద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సత్యనారాయణమూర్తి పాల్గొని మాట్లాడుతూ నిత్యం పుస్తక పఠన వల్ల జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. విద్యార్థులు చిన్నతనం నుం డి తప్పకుండా లైబ్రరీకి వెళ్లడం అలవాటుగా చేసుకోవాలన్నారు. విద్య విషయ పరిజ్ఞానంతో పాటు ఇతర అంశాలపై పుస్తక పటన ద్వారా అవగాహన పెంపొందించుకోవచ్చన్నారు. ఆయా కార్యక్రమాల్లో లైబ్రేరియన్లు, పాఠశాల హెడ్మాస్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.






