పోలీసు వాహనాల పాత విడిభాగాల వేలానికి స్పందన
16-05-2026 01:30 AM
హనుమకొండ, మే 15 (విజయక్రాంతి): వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు వాహనాల పాత విడిభాగాలకు (స్క్రాప్) సంబంధించి శుక్రవారం కమిషనరేట్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, అడిషనల్ డీసీపీ సురేష్ కుమార్ ఎస్. బి ఏసీపీ జితేందర్ రెడ్డి, ఆర్. ఐ శ్రీధర్ ఇతర పోలీస్ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరిగింది. ఈ వేలానికి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు హైదరాబాద్కు చెందిన పాత సామాను (స్క్రాప్) వ్యాపారస్తులు తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.






