ఆ దమ్ము బుమ్రాకే ఉంది
30-05-2024 01:25 AM
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా యార్కర్లను ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్లకు కష్టసాధ్యమని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత బౌలర్లలో బుమ్రా ఒక్కడే యార్కర్లను స్థిరంగా వేయగలుగుతున్నాడని.. డెత్ ఓవర్లలో అతన్ని ఎదుర్కోవడం అంత సులువు కాదని వ్యాఖ్యానించాడు. పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా తరపున బుమ్రా కీలకం కానున్న నేపథ్యంలో లీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.






