15 June, 2026 | 7:23 PM

Breaking News

రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •  

డీకే శివకుమార్ మంత్రివర్గం ఖరారు

03-06-2026 02:36 PM

కర్నాటక: డీకే శివకుమార్ మంత్రివర్గం(DK ShivaKumar Cabinet) ఖరారైంది. ఎనిమిదిసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డీకే శివకుమార్ బుధవారం సాయంత్రం 4.05 గంటలకు లోక్ భవన్‌లో కర్ణాటక 34వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి కొన్ని గంటల ముందు ముఖ్యమంత్రితో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న 13 మంది క్యాబినెట్ మంత్రుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.

జి. పరమేశ్వరను ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించగా, ఈ జాబితాలోని ఇతర పేర్లలో యతీంద్ర సిద్ధరామయ్య, యుటి ఖాదర్, ఎంబీ పాటిల్, కె.జె. జార్జ్, కె.హెచ్, మునియప్ప, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, కృష్ణ బైరెగౌడ, ప్రియాంక్ ఖర్గే, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేష్, శరణ్ ప్రకాష్ పాటిల్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

రాజ్యసభ ఎన్నికల అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, అలాగే కాంగ్రెస్ ముఖ్యమంత్రులైన వీడీ సతీశన్ (కేరళ), రేవంత్ రెడ్డి (తెలంగాణ) సుఖ్విందర్ సింగ్ సుఖు (హిమాచల్ ప్రదేశ్) హాజరుకానున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య గత వారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, శివకుమార్ ఆ ప్రతిష్టాత్మక పదవిని చేపట్టడానికి మార్గం సుగమం చేశారు.