15 June, 2026 | 7:22 PM

Breaking News

రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •  

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: 21 మంది సజీవదహనం

03-06-2026 12:28 PM

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మాలవీయనగర్ లో బుధవారం భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగి 21 మంది సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం. కొందరు బాధితులు భవనం రెండు, మూడు అంతస్తుల నుంచి దూకారు.  రెస్టారెంట్ లో చిక్కుకున్న 40 మందిని సహాయసిబ్బంది కాపాడినట్లు అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. భవనం కింది అంతస్తులోని రెస్టారెంట్ లో మంటలు అంటున్నాయి. ఘటనాస్థలిలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదంపై ఉదయం 9.45కు పోలీసులకు సమాచారం అందింది. పది అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.