9 April, 2026 | 8:35 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

చిన్నారుల హక్కులకు డీఎల్ఎస్ఏ ప్రత్యేక కృషి

14-11-2025 07:56 PM

చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): చిన్నారులకు సమాన హక్కులు కల్పించడం, వారికి అవసరమైన రక్షణ  సహాయాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా జిల్లా న్యాయ సేవాధికర సంస్థ నిరంతరం కృషి చేస్తోందని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ టి. పర్షరాములు అన్నారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన తెలంగాణ గిరిజన సంక్షేమ అప్‌గ్రేడ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో బాలల దినోత్సవంను పురస్కరించుకొని న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించడం జరిగింది. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి  బి.పుష్పలత ఆదేశాలతో సీనియర్ సివిల్ జడ్జి/కార్యదర్శి, పి.లక్ష్మణాచారి  సమన్వయంతో ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పిల్లలు భారతదేశ భవిష్యత్తు అని, బాలల హక్కులు ప్రతి ఒక్కరు గౌరవించాలని అన్నారు. ఈ సదస్సు ఎస్.మల్లేష్ యాదవ్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, లోక్ అదాలత్ సభ్యులు/న్యాయవాదులు ఆడెపు వేణు.గుర్రం ఆంజనేయులు, గిరిజన సంక్షేమ కళాశాల ప్రధానోపాధ్యాయురాలు  పి.రజని, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.