14-11-2025 07:59:20 PM
నకిరేకల్,(విజయక్రాంతి): యువత ఉద్యోగ అన్వేషణ చేస్తూనే తమకు నచ్చిన రంగంలో స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పేర్కొన్నారు. శుక్రవారం నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో కొల్లు నాగరాజు, కొల్లు నరేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కింగ్ టీ స్టాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓవైపు ప్రయత్నిస్తూనే మరోవైపు స్వయం ఉపాధిలో అగ్రగామి గా రాణించవచ్చన్నారు. స్వయం ఉపాధి ఏర్పరచుకొని సమాజంలో గౌరవ మర్యాదలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.