16 April, 2026 | 4:19 PM

Breaking News

ధాన్యం సేకరణ ప్రక్రియలో వేసవి దృష్ట్యా రక్షణ చర్యలు   •   బాధితులకు భరోసా కేంద్రాలు కొండంత అండ   •   మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదని రైతుల ఆందోళన   •   నాగిరెడ్డిపేట్ మండల జాగృతి పద్మశాలి అధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   రోడ్డు భద్రతకై వాహనదారులకు కంటి పరీక్షలు తప్పనిసరి   •   ప్రజా పాలన మండల స్థాయి సమావేశం   •   సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు   •   సురక్షిత ప్రయాణానికి కంటి చూపు ప్రధానం   •   మహిళా రిజర్వేషన్ బిల్లు— ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక   •   డీలిమిటేషన్, సవరణ బిల్లులపై ప్రతిపక్షాల నిరసన.. లోక్‌సభలో తీవ్ర వాగ్వాదం   •  

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

21-06-2025 02:38 AM

మోతె,జూన్20:- మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న వైద్య సేవలను, అలాగే సిబ్బంది హాజరును పరిశీలించారు.మందుల నిల్వలు, పారిశుధ్యం వంటి ఇతర అంశాలను కూడా పరిశీలించినట్లు సమాచారం.

ఈ తనిఖీలో భాగంగా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు.వారి వెంట జిల్లా డిప్యూటీ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటిరత్నం,మండల వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేష్, పిహెచ్‌ఎన్ జయలక్ష్మి, తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.