21-06-2025 02:37:27 AM
ఎమ్మెల్యే మురళి నాయక్
మహబూబాబాద్, జూన్ 20 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా నేతాజీ తండా వద్ద ఇటీవల గ్రానైట్ లారీ ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ పరామర్శించి, అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు.
ప్రమాద ఘటనలో గాయపడ్డ గుగులోతు శంకర్, శ్రీనివాస్, శంకర్ లను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందజేయాలని ఆస్పత్రి వర్గాలను కోరారు. రోడ్డు ప్రమాదానికి కారకులైన వారిపై చట్టపరంగా తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.