2 May, 2026 | 12:24 PM

పసిబిడ్డలను పారేయకండి...!!

02-05-2026 10:50 AM

వద్దనుకుంటే ఊయలలో వేసి వెళ్ళండి...!!! 

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహశబరీష్ 

మహబూబాబాద్,(విజయక్రాంతి): కన్నపిల్లలను పెంచి పోషించలేని వారు, కన్న తర్వాత వద్దనుకునే వారు చెత్తకుప్పల్లోనో.. ముళ్ళపొదల్లోనే విసిరివేయకండి.. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఊయల ఏర్పాటు చేసాం, అందులో వేసి వెళ్ళండి, మీ..వివరాలు ఎక్కడ బయటకు రావని మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ స్నేహశబరీష్ కోరారు. ప్రజాపాలన ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్ ఆద్వర్యంలో ఊయలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా సంక్షేమ అధికారి శిరీష, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్, జిల్లా ఇంచార్జ్ సంక్షేమ అధికారి శిరీష, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్ఎంఓ డాక్టర్ జగదీష్ , బాల రక్షభవన్ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, డీసీపీఓ కమలాకర్, బాలల సంరక్షణ అధికారులు నరేష్, వీరన్న, చైల్డ్ కోఆర్డినేటర్ వెంకటేష్, రమేష్,వెంకన్న,సరోజ, ఆమని,కళ్యాణి, అనిల్, సాయి, ఉపేందర్, హాజరయ్యారు.