18 August, 2026 | 4:55 PM

Breaking News

చెట్లు నరికివేతపై ఫిర్యాదు   •   భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి   •   బెస్ట్ ఎంప్లాయి అవార్డు గ్రహీతకు సన్మానం   •   ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ   •   ఎమ్మార్వో పి.విట్టల్, సీఐ వెంకట్ నారాయణకు ఘన సన్మానం   •   భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు   •   సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •  

ఎన్ఐ పనుల కోసం రైళ్ల రద్దు

02-05-2026 10:35 AM

మహబూబాబాద్, (విజయక్రాంతి): కాజీపేట, విజయవాడ రైల్వే సెక్షన్ లో డోర్నకల్, ఖమ్మం రైల్వే స్టేషన్ల మధ్య మూడవ లైను నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కోసం కాజీపేట విజయవాడ సెక్షన్ లో పలు రైళ్లను ఈనెల 2 నుండి 5 వరకు రద్దు చేశారు. అలాగే మరికొన్ని రైళ్లను ఇతర మార్గాల్లో మళ్లించారు. విజయవాడ - వరంగల్ - కాజీపేట ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లల్లో కొన్నింటిని రద్దు చేయగా, మరికొన్నింటిని ఇతర ప్రాంతాల మీదుగా మళ్ళించారు. ఇందులో ప్రధానంగా సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ విజయవాడ శాతవాహన ఎక్స్ప్రెస్, గుంటూరు విజయవాడ సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్ తో పాటు పలు రైలు ఈనెల 5 వరకు రద్దయ్యాయి.