అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించొద్దు
ఉమ్మడి ఏపీ రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు
ముషీరాబాద్, మార్చి 29(విజయక్రాంతి): రిజర్వేషన్ల ద్వారా లబ్దిపొంది ఉన్న తస్థాయిలో ఉన్న కొంత మంది అధికారులు అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఉమ్మడి ఏపీ విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అన్నా రు. అంబేద్కర్ పిలుపునిచ్చిన పే బ్యాక్ టూ సొసైటీ నినాదాన్ని విస్మరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సింగరేణి ఎంప్లాయిస్ అండ్ సిటీజన్స్ ఫోరం ఆధ్వర్యంలో సింగరేణి మాజీ చైర్మన్ బలరామ్ పౌర సన్మానం, వీడ్కోలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాకి మాధవరావు మాట్లాడుతూ ఎడారిలో ఒయాసిస్ లాగా బలరామ్ తనకు కనిపించాడని ఆయన కొనియాడారు. సింగరేణి సంస్థ అభివృద్ధితో పాటు సమజాహితం కో సం ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. జాతి కోసం పాటుపడుతూ సేవచేస్తున్నారని, తనకు నచ్చిన వారిలో బలరామ్ కు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా బాలరామ్ పర్యావరణ పరిరక్షణకు చేసిన సేవలపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో భరత్ భూష ణ్, జిడి. అరుణ, జేపీ రాజు, మాజీ మంత్రి, ఎంపీ రవీంద్ర నాయక్, మాజీ ఎంఎల్సీ రాములు నాయక్, టీయూ జేఏసీ తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ బాలకృష్ణ, పవన్ కుమార్, భూక్య సంజీవ్ నాయక్, డీఎస్పీ రాధ, మునీర్ సింగరేణి డిప్యూటీ జనరల్ మేనేజర్ గోళ్ల రమేష్, భూక్యా కృష్ణమూర్తి, గొల్లపల్లి దయానంద్ రావు, చొప్పర బాలకృష్ణ, మహేశ్వర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.




