నిమ్స్‌లో వయోవృద్ధులకు వైద్య శిబిరం
పంజాగుట్ట, మార్చి 29 (విజయక్రాంతి): పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో ఈ నెల 31వ తేదీ వయోవృద్ధుల కోసం ప్రత్యేక ఉచిత సమగ్ర ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ హెల్త్ మిషన్-100 కార్యక్రమంలో భాగంగా నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప ఆదేశాల మేరకు జెరియాట్రిక్ మెడిసిన్, హాస్పి టల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు సంయుక్తంగా ఈ కార్య క్రమాన్ని చేపడుతున్నాయి.
ఈ విషయమై ఆదివారం నగరి బీరప్ప మాట్లాడుతూ వృద్ధుల్లో తలెత్తే శారీరక, మానసిక సమస్యలను ముందస్తుగా గుర్తించి, వారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశ్యమన్నాడు. ఈ శిబిరంలో భాగంగా వయోవృ ద్ధులకు అవసర మైన పలు రకాల కీలక పరీక్షలను ఉచితం గా నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఇందులో కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రాండమ్ బ్లడ్ షుగర్, సీరం క్రియేటినిన్, ఈసీజీ వంటి పరీక్షలు ఉంటాయన్నారు.
వీటితో పాటు అవసరమైన వారి కి నిపుణులైన వైద్యులచే ఫిజియోథెరపీ సేవ లు, మానసిక ప్రశాంతత కోసం ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ కూడా ఉచితంగా అందజేస్తారన్నారు. వృద్ధాప్యంలో సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం ఈ శిబిరం లక్ష్యంగా వివరించారు. 60 ఏళ్లు పైబడిన వయోవృద్ధులందరూ ఈ సు వర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆసక్తి గల వారు మార్చి 31న ఉ.9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల లోపు నిమ్స్ పాత బ్లాక్లోని నెఫ్రాలజీ సెమినార్ హాల్ (గ్రౌండ్ ఫ్లోర్) వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూ చించారు. ఈ శిబిరానికి వచ్చే వారు తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని ఆసుపత్రి స్పష్టం చేశారు.




