20 June, 2026 | 8:29 PM

Breaking News

సింగరేణి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: జి ఎం షాలెం రాజు..   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు   •   మత్తు రహిత పటిష్ట సమాజ నిర్మాణానికి యోగ ఒక్కటే మార్గం   •   గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి   •   ఉద్యాన పంటల సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరించాలి   •   అధిక సాంద్రత పత్తి సాగులో న్యూమాటిక్ ప్లాంటర్‌తో విత్తనాల విత్తకం ప్రదర్శన   •   డిజిటల్ లిటరసీ, ఏఐ నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తు   •   రాజీ మార్గమే రాజమార్గం: సీనియర్ సివిల్ జడ్జి కే.సురేష్   •   రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు   •   లోక్ అదాలత్ రాజీమార్గంలో ఇద్దరు గెలుస్తారు   •  

పారమితలో ఘనంగా ఫాదర్స్ డే, అంతర్జాతీయ సంగీత దినోత్సవ వేడుకలు

20-06-2026 07:51 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): నగరంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలలో ఫాదర్స్ డే, అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్  హన్మంత రావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. వేడుకలలో భాగంగా తండ్రుల కోసం ప్రత్యేకంగా పలు వినోదాత్మక ఆటలు, సరదా పోటీలు, కుటుంబ బంధాలను బలోపేతం చేసే కార్యక్రమాలను నిర్వహించారు. గెలుపొందిన తండ్రులకు పాఠశాల డైరెక్టర్  హన్మంత రావు బహుమతులు అందజేశారు.