1 July, 2026 | 9:20 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఫేక్ వాట్సాప్ మెసేజ్‌ను నమ్మి మోసపోకండి

17-12-2025 12:23 AM

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

ములుగు, డిసెంబర్16(విజయక్రాంతి):వాట్సాప్ లో జిల్లా కలెక్టర్ ఫోటోను ఉపయోగించి డబ్బులు పంపాలని కోరుతూ నకిలీ సందేశాలు పంపిస్తున్న ఘటనలపై అధికారులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.తన ఫోటోను ప్రొఫైల్గా పెట్టుకొని కొందరు దుండగులు వివిధ అధికారులకు, వ్యక్తులకు వాట్సాప్ సందేశాలు పంపి డబ్బులు పంపించాలని అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఇటువంటి సందేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని, ఎలాంటి లావాదేవీలు చేయవద్దని అధికారులకు, ప్రజలకు సూచించారు.జిల్లా కలెక్టర్ పేరు, ఫోటో లేదా హోదాను ఉపయోగించి వచ్చే సందేశాలు నకిలీవని, తన తరఫున వ్యక్తిగతంగా గానీ, వాట్సాప్ ద్వారా గానీ డబ్బులు అడగబోనని ఆయన స్పష్టం చేశారు.

ఇలాంటి నకిలీ మెసేజీలు అందిన వెంటనే సంబంధిత వాట్సాప్ నంబర్లను బ్లాక్ చేయాలని, సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆ ప్రకటలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.