calender_icon.png 17 December, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

17-12-2025 12:24:48 AM

రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి  కొండా సురేఖ

హనుమకొండ టౌన్ , డిసెంబర్ 16 (విజయక్రాంతి):అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గల 27, 32, 35, 37, 38, 41వ డివిజన్లలో మంత్రి కొండా సురేఖ విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రకటించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించి, కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేదవారి ఆశయాన్ని నెరవేర్చడం కోసం రాష్ట్రం ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేయడం జరుగుతుందన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పేదల సమస్యలు మానవత దృక్పథంతో అధికారులు పరిశీలించి త్వరితంగా పరిష్కరించాలన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో అభివృద్ధి, సంక్షేమం జోడొద్దుల్లా ముందుకు తీసుకెళుతున్నారని మంత్రి సురేఖ తెలిపారు. రానున్న రోజుల్లో వరంగల్ జిల్లా అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి  సహకారంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను నేరుగా పరిశీలించి, వేగంగా నాణ్యతతో పూర్తయ్యేలా అధికారులకు సూచనలు చేశారు.

మంత్రి కొండా సురేఖ ప్రజలతో మమేకమై వారి సమస్యలు, అవసరాలను తెలుసుకొని పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, నగర మేయరు గుండు సుధారాణి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.