calender_icon.png 18 December, 2025 | 1:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాభివృద్ధికి కృషి చేయండి

17-12-2025 12:21:10 AM

బీఆర్‌ఎస్ సర్పంచులను అభినందించిన వద్దిరాజు కిషన్ 

కేసముద్రం, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ప్రజలు ఎంతో నమ్మకంతో మీకు ఓట్లు వేసి గెలిపించారని, ప్రజల నమ్మకం మేరకు గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ లకు ఇనుగుర్తి మండల అడ్ హాక్ కమిటీ కన్వీనర్ వద్దిరాజు కిషన్ సూచించారు. మహబూబాబాద్ ఇనుగుర్తి మండల పరిధిలో బీ ఆర్ ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించిన నేపథ్యంలో మంగళవారం ఇనుగుర్తి మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో అభినందించా రు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని,  ఇందుకోసం తాను మీ వెంట ఉండి నడుస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో మౌలిక వసతులు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రణా ళిక రూపొందించాలని,  సమిష్టి కృషితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కొత్త గా ఏర్పడ్డ ఇనుగుర్తి మండల అభివృద్ధికి ముందుంది నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిన్యా తండా, కోమటిపల్లి, అయ్యగారిపల్లి, చిన్న ముప్పారం గ్రామాల సర్పంచులు జాటోత్ హరిచంద్, మద్దెల బిక్షపతి,  మలిశెట్టి శోభన్, రాయల భవాని శేఖ ర్ తదితరులు పాల్గొన్నారు.