సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు
నిర్మల్ (విజయక్రాంతి): దిల్వార్పూర్ మండలంలో నిర్మిస్తున్న ప్రైవేట్ విత్తనాల పరిశ్రమ రద్దు కోసం ఇటీవలే రైతుల ఆందోళనలో పాల్గొన్న పలువురుపై కొత్తగా కేసులు నమోదు చేయలేదని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. కొన్ని సోషల్ మీడియాలో ఆందోళనలో పాల్గొన్న పలువురుపై కేసులు నమోదు అయినట్లు సామాజిక మద్యమాల్లో కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని దీని నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. గతంలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న రైతులపై అప్పుడు పెట్టిన కేసులకు సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే రైతులకు ఇవ్వడం జరిగిందని అవి కొత్త కేసులు కావని రైతులు సమన్వయంతో వివరించాలని కోరారు. రైతులను తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని సామాజిక మాధ్యమాలు విచార ప్రచారం చేస్తున్నాయని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. రైతులు అయోమయానికి గురి కావద్దని తెలిపారు.






