7 May, 2026 | 7:56 PM

ఎమ్మెల్యే వివేక్ పై ఎమ్మార్పీఎస్ ఫైర్..

10-12-2024 07:43 PM

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి 

బుర్రి సతీష్ మాదిగ...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో పోరాటానికి మాదిగలు సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జి బుర్రి సతీష్ మాదిగ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ లో మంగళవారం సంఘం జిల్లా అధ్యక్షులు ఆరేల్లి మల్లేష్ మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... గ్రామ స్థాయిలో సంఘం నూతన నిర్మాణం చేపట్టాలని, పల్లెలను దండోరా ఉద్యమ కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న గడ్డం వివేక్ వెంకటస్వామి నీవు ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు గడ్డమీద నిన్ను బొంద పెడతాం ఖబర్దార్ అని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి మాలల సవతి తల్లి ప్రేమకు లొంగిపోవద్దన్నారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు.