7 May, 2026 | 9:54 PM

నిరంతరం విద్యుత్ వెలుగులు పట్టించుకోని అధికారులు.!

10-12-2024 07:56 PM

అనంతగిరి (విజయక్రాంతి): అనంతగిరి మండలం రంగయ్య గూడెం గ్రామ వీధుల్లో వీధి దీపాలు చాలా రోజులు పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం వెలుగుతుండటంతో ఎంతో విలువైన విద్యుత్తు వృధా అవుతోంది. అధికారులు గ్రామపంచాయతీ ఇబ్బందులు పట్టించుకోపోవడం దారుణమని గ్రామస్తులు ఆరోపించారు. విద్యుత్తు దీపాలు నిరంతరం వెలుగుతుండటంతో బల్బులు తొందరగా కాలిపోతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా విలువైన విద్యుత్తు వృధాని అరికట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.