27 April, 2026 | 2:15 AM

పెట్రోల్, డీజిల్ కొరత సృష్టించొద్దు

27-04-2026 12:23 AM

ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర టెలీకాన్ఫరెన్స్

ఖమ్మం, ఏప్రిల్ 26(విజయ క్రాంతి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రంగా వేధిస్తున్న పెట్రోల్, డీజిల్ కొరతపై బీఆర్‌ఎస్ ఎంపీ, పెట్రోల్, సహజ వాయు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పందించారు. ఆయా కంపెనీల సరఫరాదారులు, ఉన్నతాధికారులతో ఆ యన ఫోన్లో మాట్లాడి పెట్రోల్ డీజిల్ కొరతలను తక్షణమే తీర్చాలని సూచించారు. ఆదివారం వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్రను పలువురు పెట్రోల్ బంక్‌ల యజమానులు, అ సోసియేషన్ ప్రతినిధులు కలిశారు.

పెట్రో ల్, డీజిల్ సరఫరాలో జరుగుతున్న జా ప్యం, బంకుల్లో ఏర్పడుతున్న కొరత గురిం చి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే ఆయన అక్కడి నుంచే ఆయిల్ కంపెనీల ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం నుంచి ఉమ్మడి ఖ మ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని బం కుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు లేవు. దీంతో రైతులు, చిరుద్యోగులు, వ్యాపారులు, వా హనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆయా కంపెనీల ప్రతిని ధుల దృష్టికి తీసుకెళ్లారు.

బంకుల యజమానులు డీడీలు చెల్లించినా కూడా ఆయి ల్ సరఫరా చేయకుండా జాప్యం ఎందుకు చేస్తున్నారు? అని ఆయన వారిని ప్రశ్నించారు. రేట్ల హెచ్చుతగ్గులను దృష్టిలో పెట్టు కుని కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించా రు. ఆయిల్ కొరత ఇలాగే కొనసాగితే తెలంగాణలో సమస్యలు తీవ్రమవుతాయని ఆయన సరఫరా కంపెనీలకు వివరిం చారు.

తక్షణమే పెట్రోల్, డీజిల్ కొరతను నివారించాలని, సరఫరా వేగవంతం చేయాలని కోరారు. స్పందించిన ఆయిల్ కంపెనీల ఉన్నతాధికారులు.. సోమవారానికల్లా సమస్య ను అధిగామిస్తామని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఎంపీ రవిచంద్రకు బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీల ప్రతినిధులు హామీ ఇచ్చారు.