డేటా ఎవ్వరికీ ఇవ్వొద్దు
27-05-2026 12:40 AM
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): పాఠశాలల్లో చదివే విద్యార్థుల వివరాలను ఎవ్వరికీ ఇవ్వొద్దని ఆర్జేడీలు, డీఈవోలు, హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు, ప్రైవేట్ విద్యాసంస్థలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.






