బాల్య వివాహాలను అరికట్టాలి
దేవరకద్ర, మే 26 : బాల్య వివాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మండల విద్యాధికారి బలరాం సూచించారు. మంగళవారం మండల పరిధిలోని బస్వాయి పల్లి గ్రామంలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక లో భాగంగా ప్రైమరీ స్కూల్ దగ్గర మండల స్థాయి మహిళా వారోత్సవాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పి. బలరాం మాట్లాడుతూ బాల్యవివాహాలను అరికట్టాలని సూచించారు. బాలురకు 2, బాలికలకు 18 సంవత్సరాలు పూర్తి అయ్యేవరకు వివాహాలు చేయరాదని మండల విద్యాధికారి తెలిపారు. చిన్న వయస్సులో వివాహాలను చేయడం ద్వారా శారీరకంగాను, మానసికంగాను ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.
అనంతరం ఐసీడిఎస్ సూపర్వైజర్ గీత మాట్లాడుతూ బాల్య వివాహాలు చేసుకోవడం ద్వారా ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీలు, బాలల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బద్రియ, ఖాజా మొయినుద్దీన్, ఐసీపీస్ టీం, సఖి టీం, షీ టీం, పోలీస్ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, విద్యార్థులతల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






