ఎస్‌ఐ, సీఐకి సన్మానం
01-08-2026 12:10 AM
శంకర్‌పల్లి: జూలై 31(విజయక్రాంతి): చేవెళ్ల పోలీసు స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సి.ఐ నరేందర్ రెడ్డి, ఎస్‌ఐ కోటేశ్వర్ రావులను మోకిల గ్రామానికి చెందిన, చేవెళ్ల నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షుడు బండమీది వెంకటేష్ శుక్రవారం కలిసి పుచ్పగుచ్చం ఇచ్చి, శాలువాలతో సన్మానించారు. అనంతరం జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా బండమీది వెం కటేష్ యాదవ్ మాట్లాడుతూ మొకిల పోలీ స్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న వేళ ఎస్. ఐ కోటేశ్వర రావు మద్యపాన నిషేధం, మా దక ద్రవ్యాల, భద్రతా, రోడ్డు ప్రమాదాల మార్గ దర్శకత కోసం విధులు నిర్వర్తించిన సేవలు మరువలేనివి అని కొనియాడారు.






