ఆదివారాలు ఆలయాలకు వెళ్లొద్దు!
28-05-2024 12:05 AM
వీకెండ్ వచ్చిందంటే చాలు, మన తెలంగాణలోని పలు ప్రసిద్ధ దేవాలయాలు రద్దీతో కిటకిటలాడిపోతున్నాయి. సెలవు కావడమే విశేషం. హైదరాబాద్ నగరానికి దగ్గరిలోని యాదగిరిగుట్టకు ప్రతీ వీకెండ్స్‌లో వెళ్లే ప్రయాణికుల సంఖ్య అపరిమితంగా ఉంటున్నది. ఈ ఆదివారం ఒక్కరోజే 81 వేల మంది గుట్టను సందర్శించగా, కోటి రూ. ఆదాయం లభించినట్టు వార్త వచ్చింది. భద్రాచలమూ భక్తులతో నిండిపోయింది. స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం వల్ల కూడా భువనగిరివద్ద జనసమ్మర్ధం బాగా పెరిగింది. గుట్టకు వెళ్లే ప్రతీ ఒక్కరూ తమ వాహనాలను అటువైపు మళ్లిస్తున్నారు. దాంతో ట్రాఫిక్ పెద్ద సమస్యవుతున్నది.
-గంగాధరభట్ల నరసింహమూర్తి శర్మ
హెచ్‌ఎంటీ నగర్






