దారుణం గాలివాన బీభత్సం
28-05-2024 12:05 AM
ఆదివారం రాత్రి తెలంగాణలోని పలు ప్రాంతాలు గాలివాన బీభత్సానికి గురై పదమూడు మంది ప్రాణాలు పోగొట్టుకోవడం అత్యంత దయనీయం. గోడలు కూలడం, పిడుగుపాటు, వాహనాలపై చెట్లు పడటం వంటి సంఘటనలు వింటేనే ఒళ్లు గగు ర్పొడుస్తున్నది. ఈ కాలంలో ముసుర్లు లేకపోగా, అతివృష్టితో వరదలు ముంచుకు వస్తున్నాయి. గాలి, దుమారం, ఉరుములు, మెరుపులతో పిడుగులు పడటం వంటి భయానక పరిస్థితితో అనేకమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవలసి వస్తున్నది. అమాయకుల ప్రాణాలు ఇలా పోవడం అన్యాయం.
-ఆర్.రాజన్న, హుస్నాబాద్






