21 July, 2026 | 12:35 PM

స్కీములను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించొద్దు

21-07-2026 01:47 AM

మహబూబాబాద్, జులై 20 (విజయక్రాంతి): భవన నిర్మాణ కార్మికులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించవద్దని, ప్రస్తుతం అమలు చేస్తున్న వైద్య పరీక్షల నుంచి ప్రైవేట్ కంపెనినీ తప్పించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయడానికి సన్నద్ధమైందని,  బి ఓ సి డబ్ల్యూ 1996 చట్టము, అలాగే సామాజిక భద్రత కోడ్లో భాగంగా వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలు జరిపే స్కీములన్నింటిని ప్రవేటికరించే విధంగా ముందుకు సాగుతుందని ఆరోపించారు. 

2009  వెల్ఫేర్ బోర్డు ఏర్పడిన నాటి నుండి నేటి వరకు వెల్ఫేర్ బోర్డులో నమోదు చేసుకున్న కార్మికుల సంఖ్య 28 లక్షల 50 వేలు, ప్రస్తుతం 15 లక్షల 50 వేలు మాత్రమే రెన్యువల్ చేశారని, 13 లక్షల మందికి కార్డులు రెన్యువల్ చేయలేదని విమర్శించారు.   ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి కుంట్ల నాగన్న, సిఐటియు సహాయ కార్యదర్శి దుండి వీరన్న, నాయకులు బానోత్ శంకర్, పాల బిందెల మల్లయ్య, వాసం దుర్గారావు, తోట శ్రీనివాస్, ఎర్ర శ్రీనివాస్, పులుగుజు వెంకన్న పాల్గొన్నారు.