ఉత్సవాల్లో అపశృతి.. అగ్నిగుండంలో పడిన భక్తులు
04-03-2026 12:33 PM
హైదరాబాద్: నల్లొండ(Nalgonda) జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లులో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి(Sri Parvati Ramalingeswara Swamy) జాతరలో అపశృతి చోటుచేసుకుంది. జాతరకు వచ్చిన భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో పలువురు భక్తులు నిప్పుల గుండంలో పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు నిప్పుల్లో పడిన వారిని బయటకు లాగారు. ఈ ప్రమాదంలో పది మంది భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట, నల్లొండ, మిర్యాలగూడ ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.




