4 March, 2026 | 1:04 PM

యుద్ధం ఎఫెక్ట్: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

04-03-2026 11:59 AM

దేశీయ స్టాక్ మార్కెట్లపై వార్ ఎఫెక్ట్

ముంబై: బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు సెన్సెక్స్(BSE Sensex), నిఫ్టీ పతనమయ్యాయి. పశ్చిమాసియాలో సంఘర్షణ పెరగడంతో చమురు ధరలు పెరిగాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్ ప్రారంభ ట్రేడింగ్‌లో 1,758.22 పాయింట్లు లేదా 2.19 శాతం పతనమై 78,480.63 వద్ద ముగిసింది. 50 షేర్ల ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 530.85 పాయింట్లు లేదా 2.13 శాతం పతనమై 24,334.85 వద్ద ముగిసింది. 


ఇరాన్ వార్ ఎఫెక్ట్(Iran War Effect) దేశీలయ స్టాక్ మార్కెట్లపై పడింది. సెన్సెక్స్ ప్యాక్ నుండి, లార్సెన్ అండ్ టూబ్రో, టాటా స్టీల్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, మహీంద్రా నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు(Crude oil prices) కలవరపెడుతున్నాయి. బ్యారెల్ ముడిచమురు ధర 82 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతోంది. ముడి చమురు నిల్వలపై ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో 25 రోజులకు సరిపడా ముడిచమురు, పెట్రోల్- డీజిల్ నిల్వలు ఉన్నాయని పెట్రోలియమ్ మంత్రి హర్దీప్ సింగ్ పురి(Hardeep Singh Puri) వెల్లడించారు.

ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి రూపాయి విలువ 

బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ(Rupee slumped ) 69 పైసలు తగ్గి, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 92.18కి చేరుకుంది. అమెరికా-ఇరాన్ వివాదం తీవ్రతరం కావడంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ముడి చమురు ధరలు గణనీయంగా పెరగడం పెట్టుబడిదారుల ప్రభావం చూపింది. ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో ఫ్యూచర్స్ ట్రేడ్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 82 డాలర్లను దాటడంతో, ముడి చమురు ధరలు గణనీయంగా పెరగడం వల్ల దేశీయ కరెన్సీ(Indian currency) తీవ్ర ఒత్తిడికి గురవుతోందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఇది పెట్టుబడిదారుల మనోభావాలను దెబ్బతీసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో, రూపాయి 92.05 వద్ద ప్రారంభమైంది. తరువాత అమెరికన్ కరెన్సీతో పోలిస్తే 92.18 కనిష్ట స్థాయికి పడిపోయింది, దాని మునుపటి ముగింపు నుండి 69 పైసలు తగ్గింది.