ఢిల్లీకి సీఎం రేవంత్.. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై కసరత్తు
హైదరాబాద్: రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కసరత్తు ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఢిల్లీకి పయనం అయ్యారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు. టీపీసీసీ చీఫ్ జూమ్ ద్వారా మీటింగ్‌లో పాల్గొననున్నారు.
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీకి ముగ్గురి పేర్లను ప్రతిపాదించనున్నారు. రాజ్యసభ(Rajya Sabha Elections) రేసులో వీహెచ్, వేం నరేందర్ రెడ్డి, పుంజాల వినయ్ కుమార్ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు సీట్లలో ఒకటి అభిషేక్ మను సింఘ్వీకి(Abhishek Manu Singhvi) ఫైనల్ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.




